సర్వీసులో ఉంటూ చనిపోయిన ఉద్యోగుల కుటుంబాలకు 3 కేటగిరీల్లో పరిహారం చెల్లించాలని ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది. క్లాస్-4 ఉద్యోగులైతే రూ. 5లక్షలు, నాన్ గెజిటెడ్ ఉద్యోగులైతే రూ. 8లక్షలు, గెజిటెడ్ ఉద్యోగులైతే రూ. 10లక్షలు ఇవ్వనుంది. ఉద్యోగి కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకం కింద ఉద్యోగం పొందే అర్హత లేకపోవడం, ఆ ఫ్యామిలీలో మరెవరూ సంపాదించే వారు లేకపోతే ఈ పరిహారం అందించనున్నట్లు ఆదేశాల్లో పేర్కొంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa