దత్తిరాజేరు మండలంలో 2021-22 సంవత్సరంలో ధాన్యం కొను గోలు కేంద్రాల్లో అవకతవకలు జరిగాయని గతంలో లోకాయుక్తాలో అందిన ఫిర్యాదు మేరకు తోటపల్లి కాలువ రెండో విభాగం స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ జోషఫ్ ఆధ్వర్యంలో బుధవారం తహసీల్దార్ కార్యాలయంలో దర్యాప్తు చేపట్టారు. ఈ సందర్భంగా 2021-22 సంవత్సరంలో రైతులకు ధాన్యం డబ్బులు అందాయి కానీ ట్రాన్స్‌పోర్టు, హమాలీల చార్జీలు అందలేదని మండలంలోని గడసాం గ్రామా నికి చెందిన మండల పైడిరాజు చేసిన ఫిర్యాదు మేరకు ఈ దర్యాప్తు చేపడుతున్నా మని ఆయన తెలిపారు. 2023వ సంవత్సరంలో సంబంధిత అధికారులను దర్యాప్తు చేపట్టాలని తెలిపామని, దాని మేరకు బుధవారం అధికారులను వివరాలు కోరగా ఫిర్యాదుదారుడు హాజరుకాలేదని తెలిపారు. దర్యాప్తు నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తామన్నారు. కార్యక్రమంలో సీఎస్‌డీటీ ధనం, మండల వ్యవసాయాధి కారిణి అనూరాధ తదితరులు పాల్గొన్నారు.