గ్రామ సచివాలయ సిబ్బందితో సమీక్ష సందర్భంగా రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. ఈసందర్భంగా గ్రామ సచివాలయ ఉద్యోగులు మాట్లాడుతూ.. తమపై అజమాయిషీ చేసేది మాతృశాఖలు కాగా, జీతాలు ఇచ్చేది పంచాయతీ కార్యదర్శులని వివరించారు. తమను పూర్తిస్థాయిలో మాతృశాఖలకు అనుసంధానం చేసి జూనియర్ అసిస్టెంట్ పేస్కేలు అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ గ్రామ, వార్డు, సచివాలయ వలంటీర్ల వ్యవస్థపై త్వరలో కమిటీ వేసి అధ్యయనం చేస్తామన్నారు. ఆ కమిటీ నివేదిక అనంతరం విధివిధానాలు రూపొందిస్తామన్నారు. వచ్చే నెల పింఛన్ల పంపిణీ ఒకటో తేదీ ఉదయం 6గంటలకే ప్రారంభించి 10గంటలలోపు పూర్తి చేయాలని మంత్రి గ్రామ సచివాలయ సిబ్బందికి సూచించారు.