రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ ఆఫ్ టెక్నాలజీస్ (ఆర్జీయూకేటీ) పరిధిలోని శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లో పీయూసీ-1 ప్రవేశాలకు నిర్వహించిన తొలివిడత కౌన్సెలింగ్ శనివారం ముగిసింది. రెండు రోజుల పాటు జరిగిన కౌన్సెలింగ్‌కు మొత్తం 1,035 మందిని పిలవగా 863 మంది హాజరై ప్రవేశాలు పొందారు. 172 మంది గైర్హాజరయ్యారు. ప్రవేశాలు పొందిన విద్యార్థులకు ఇక్కడి క్యాంపస్ డైరెక్టర్ డాక్టర్ కేవీజీడీ బాలాజీ, ఏవో ముని రామకృష్ణ ధృవీకరణ పత్రాలు, గుర్తింపు కార్డులను అందజేశారు. కార్యక్రమంలో అకడమిక్ డీన్ కొర్ల మోహనకృష్ణ చౌదరి, కౌన్సెలింగ్ కోఆర్డినేటర్ పి.గోవర్ధన్‌రావు, కో.కోఆర్డినేటర్ కె.రమణ, పీఆర్వో మామిడి షణ్ముఖ తదితరులు పాల్గొన్నారు.