తమను రెన్యువల్ చేయాలని సీఆర్టీలు డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం పార్వతీపురం ఐటీడీఏ ఎదుట మెడకు ఉరితాళ్లు బిగించుకుని వినూత్నంగా నిరసన తెలిపారు. మొత్తంగా 206 మంది సీఆర్టీలను వెంటనే రెన్యువల్ చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చినా.. 47 మందికి ఎందుకు ఆర్డర్లు ఇవ్వలేదని ప్రశ్నించారు. గత ఐదు రోజుల నుంచి రిలే దీక్షలు చేస్తున్నప్పటికీ అధికారులు స్పందించకపోవడం దారుణమన్నారు. ఉపాధ్యాయులు లేక అనేక గిరిజన పాఠశాలలు మూతపడుతున్నాయని తెలిపారు. నూతన పీవో దీనిపై దృష్టి సారించి.. తమకు న్యాయం చేయాలని వారు కోరారు. ఈ నిరసనలో యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి మురళీ మోహన్‌రావు తదితరులు పాల్గొన్నారు.