ఎల్ కోట మండలంలో ఓడిఎఫ్ ప్లస్ సర్వే విస్తృతంగా సాగుతోంది. ఈ మేరకు ఎంపీడీవో రూపేష్ తన సిబ్బందితో కలిసి ఆదివారం జమ్మాదేవిపేట, ఎల్ కోట తలారి గ్రామాల్లో ఓడిఎఫ్ ప్లస్ సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో రూపేష్ మాట్లాడుతూ బహిరంగ మలవిసర్జన రహిత గ్రామాలను గుర్తించేందుకు ఓడిఎఫ్ ప్లస్ సర్వే చేపడుతున్నట్లు తెలిపారు. ఓడిఎఫ్ లో నిర్మించుకున్న మరుగుదొడ్లను ప్రజలు విధిగా వినియోగించుకోవాలని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa