ఎక్సైజ్ శాఖ కొత్త పాలసీ రూపకల్పనపై ప్రభుత్వం కసరత్తు చేపట్టింది. పాలసీ రూపకల్పనకు వివిధ రాష్ట్రాల్లో అధ్యయనం చేయాలని నిర్ణయించింది. ఆరు రాష్ట్రాల్లో అధ్యయనం కోసం నాలుగు టీంల ఏర్పాటు చేయగా... ఒక్కో టీంలో ముగ్గురు చొప్పన అధికారులు ఉండనున్నారు. రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్, కర్ణాటక-తెలంగాణ, తమిళనాడు-కేరళ రాష్ట్రాలకు నాలుగు బృందాలు వెళ్లి అధ్యయనం చేయనున్నారు. ఆయా రాష్ట్రాల్లోని ఎక్సైజ్ పాలసీ, షాపులు, బార్లు, ధరలు, మద్యం కొనుగోళ్లు, నాణ్యత, చెల్లింపుల విధానం, డిజిటల్ పేమెంట్ అంశాలపై బృందాలు అధ్యయనం చేయనున్నాయి.