భారత జాతీయ జెండా రూపకర్త, తెలుగు జాతి ముద్దుబిడ్డ పింగళి వెంకయ్య జయంతి నేడు. ఈ సందర్భంగా ఆ మహినీయుడిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్మరించుకున్నారు. పింగళి వెంకయ్య అందించిన స్ఫూర్తిని జాతి మరువదన్నారు. ఈ రోజు పింగళి వెంకయ్య జయంతి అని... ఆ మహనీయునికి మనస్ఫూర్తిగా అంజలి ఘటిస్తున్నట్లు తెలిపారు. స్వాతంత్ర్య ఉద్యమ కాలంలో మన దేశానికి ఒక కేతనం ఉండాలనే తపనతో వెంకయ్య మువ్వన్నెలతో పతాకాన్ని తీర్చిదిద్దారన్నారు. ఆ జెండా నాడు, నేడు, ఎన్నడూ మన కీర్తి కేతనంగా ఎగురుతూనే ఉంటుందన్నారు. ఆ జెండాకు సెల్యూట్ చేసిన ప్రతిసారి పింగళి వెంకయ్య స్ఫురణకు వస్తూనే ఉంటారని ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa