‘విశాఖ ఉక్కును ప్రైవేటీకరించం అని చెప్పి బతికించారా? లేక నిధులు ఇవ్వకుండా చంపాలని చూస్తున్నారా?’ అని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘అమ్మ పెట్టదు అడుక్కు తిననివ్వదు అన్నట్లు ఉంది కేంద్రం తీరు. రూ.ఆరు వేల కోట్లు అప్పుల్లో ఉన్నామని, ఉక్కు తయారీకి ముడి పదార్థాలు నిండుకున్నాయని, ముడిపదార్థాలు కొనేందుకు చిల్లిగవ్వలేదని యాజమాన్యం చేతులు ఎత్తేస్తుంటే.. మోదీకి కనీనం చీమ కుట్టినట్లైనా లేదు. విశాఖ ఉక్కుపై డబుల్ గేమ్ ఆడుతున్నారు. లేదు లేదంటూనే మోదీ తన దోస్తులకు విశాఖ ఉక్కును కట్టబెట్టే కుట్ర చేస్తున్నారు. విశాఖ స్టీల్‌కు రూపాయి సహాయం చేయకుండా వెంటిలేటర్ మీదకు నెట్టారు. త్వరలోనే అదానీ, అంబానీ, జిందాల్ లాంటి వాళ్లకు కట్టబెట్టే ముహూర్తం కూడా ఫిక్స్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో ప్లాంట్‌కు పూర్వవైభవం తీసుకురావాలి’ అని షర్మిల డిమాండ్ చేశారు.