అక్టోబరు నుంచి కొత్త మద్యం పాలసీని అమల్లోకి తేవాలని ప్రభుత్వం భావిస్తోంది. అధికారులు తొలుత రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ, కేరళ, తమిళనాడు రాష్ర్టాల్లోని మద్యం పాలసీలను పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నారు. దీనికిగాను 4 కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ నెల 12లోగా అధికారులు ఆయా రాష్ట్రాల్లో పర్యటిస్తారు. ఆ తర్వాత ఒక కన్సల్టెన్సీ ద్వారా మరింత అధ్యయనం చేయించి తుది ప్రతిపాదనలు ప్రభుత్వం ముందుంచుతారు. ఈ నెలాఖరుకు ఈ కసరత్తు పూర్తిచేసి, వచ్చే నెలలో కొత్త పాలసీని ప్రకటిస్తారు. సెప్టెంబరులో నూతన పాలసీ రూపకల్పన, లైసెన్సుల జారీ ప్రక్రియను పూర్తిచేసి... అక్టోబరులో కొత్త పాలసీని అమల్లోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అలాగే నెల రోజుల్లో మద్యం షాపుల్లో డిజిటల్ లావాదేవీల విధానం ప్రవేశపెట్టనున్నారు. ఎక్సైజ్ శాఖ పునర్నిర్మాణంపైనా ప్రతిపాదనలు సిద్ధంచేస్తున్నారు.