విజయనగరం జిల్లాలో నేరాల నియంత్రణకు కంట్రోల్ రూమ్ సిబ్బంది అప్ర మత్తంగా వ్యవహరించాలని ఎస్పీ వకుల్‌జిందాల్ ఆదేశించారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని పోలీస్ కంట్రోల్ రూంను, క్వార్టర్స్‌ను, స్టేషన్ ప్రాంగణాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాత్రి గస్తీలను నిరంతరం పరిశీలించి ఎప్పటికప్పుడు వారిని అప్రమత్తం చెయ్యాలన్నారు. విధులను పర్యవేక్షించేందుకు నియమించిన అధికారులను ఎప్పటికప్పుడు అప్రమత్తంచేసి నేరాలు జరగకుండా చూడాలన్నారు. డయల్ 100, మహిళల బద్రతకు ఏర్పా టు చేసిన ఎస్.ఓ.ఎస్ కాల్స్ పనితీరును మెరుగుపరుచుకోవాలన్నారు. ఇళ్లల్లో దొంగతనం జరగకుండా లాక్‌డ్ హౌస్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ పనితీ రును ఏ.ఎ ప్రాంతాల్లో అమర్చేది.. వాటిని పోలీస్ కంట్రోల్ రూంనుంచి ఏ విధంగా పర్యవేక్షిస్తున్నదీ సిబ్బం దిని అడిగి తెలుసుకున్నారు. ఎదైనా నేరం జరిగినట్లుగా ఫిర్యాదు అందిన వెంటనే ఇతర ప్రాంతాలను స్టేషన్ ను అప్రమత్తం చేసి, నేరస్థులు ప ట్టుబడే విధంగా కంట్రోల్ రూం సి బ్బందిని ఆదేశించారు. ఎస్‌బీసీఐ నరసింహమూర్తి, కంట్రోల్ రూమ్ సీఐ రాజశేఖర్, సిబ్బంది పాల్గొన్నారు.