కడియం మండలంలో చేనేతభవన్ ఏర్పాటు చేసి నేత కార్మికులకు శిక్షణ ఇచ్చేవిధంగా ప్రణాళికలు చేస్తున్నట్లు రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి తెలిపారు. బుధవారం పొట్టిలంకలో జాతీయ చేనేత దినత్సోవం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గోరంట్ల మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వంలో నేత పరిశ్రమ చిరునవ్వులు పూసాయని, ప్రస్తుతం చేనేత కార్మికులు గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారన్నారు. ఈ పరిశ్రమను పనికి ఆహార పథకంలో చేర్చాలని సీఎం చంద్రబాబునాయుడును గతంలో కోరామన్నారు. దీని ద్వారా నేత కార్మికులకు కొంత వెసులుబాటు కలుగుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం అందుకు సహకరించాల్సి ఉందని, ఎన్డీయే కూటమిలో ఉన్న సీఎం చంద్రబాబునాయుడు కేంద్రాన్ని ఒప్పించే బాధ్యత తీసుకుంటారన్నారు. అనంతరం కేకు కట్ చేసి జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు వెలుగుబంటి నాని, మార్గాని సత్యనారాయణ, కలిదిండి గోవిందు, కొత్తపల్లి శ్రీరామ్, ఎంపీడీవో జి రాజ్‌మనోజ్ తదితరులు పాల్గొన్నారు. సినిమా చెట్టును బతికిస్తాం.. సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగిస్తాం కుమారదేవంలో నేలవాలిన చెట్టు పరిశీలించిన కలెక్టర్ కొవ్వూరు, ఆగస్టు 7: సినిమా చెట్టు చిగురించే విధంగా పునరుద్ధరణ చర్య లు చేపడుతున్నట్లు జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి తెలిపారు. కొవ్వూరు మండలం కుమారదేవం గ్రామంలో గోదావరి ఒడ్డున నెలకొరిగిన సినిమా చెట్టును బుధ వారం జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి, జిల్లా ఫారెస్టు అధికారులు, రోటరీక్లబ్ సభ్యులు పరిశీలించారు. 150 సంవత్సరాల వయస్సున్న నిద్రగన్నేరు చెట్టు దెబ్బతిని రెండుగా చీలి నెలకొరిగింది. రోటరీక్లబ్ సహకారంతో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి పడిపోయిన చెట్టును బ్రతికించే ప్రయత్నం చేస్తున్నా రు. గోదావరితీరంలో జరిగే సినిమా షూటింగ్‌లలో ఎక్కువగా ఈ ప్రాంతంలో జరగడంతో ఈ చెట్టుకు సినిమా చెట్టుగా గుర్తింపు వచ్చిందన్నారు. ఈ ప్రాం తాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయడానికి జిల్లా టూరిజం కౌన్సిల్ ద్వారా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. జిల్లా డీఎఫ్‌వో బి.నాగరాజు మాట్లాడుతూ కుమారదేవం గ్రామంలో గోదావరి ఒడ్డున నెలకొరిగిన చెట్టు ఏపుగా, గుబురుగా పెరిగే వృక్షం అన్నారు. ఎండిపోయిన బలమైన కొమ్మలు తొలగించకపోతే కాలక్రమేణ చెట్టు పడిపోయే ప్రమాదం ఉందన్నారు. ప్రజలు, గ్రామస్తుల మనోభావాలను కాపాడుతూ అదే చెట్టును సాంకేతికంగా బ్రతికించుకోవడానికి ప్రవాసాంధ్రులు సైతం ముందుకు వస్తున్నారన్నారు. రోటరీక్లబ్ సభ్యులు ముందుకు వచ్చారు. గతంలో 150 సంవత్సరాల చెట్టును ట్రాన్స్‌ప్లాంట్ చేశారు. నేను కూడా చూశాను అదే పద్ధతిని ఉపయోగించి ఈ చెట్టును బ్రతికించే అవకాశం ఉందన్నారు. ఈ సందర్భంలో పారెస్టు డిపార్టుమెంటు నుంచి సలహాలు, సూచనలు అందిస్తామన్నారు. ఈ చెట్టును పునర్మించడానికి ఖచ్చితంగా ప్రయత్నం చేస్తున్నామన్నారు. కలెక్టర్ వెంట సబ్‌కలెక్టర్ ఆశుతోష్ శ్రీవాస్తవ, ఇన్‌చార్జి తహసీల్ధార్ కె.అజయ్‌బాబు, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ విశ్వేశ్వరరావు, మండల టీడీపీ అధ్యక్షుడు వట్టికూటి వెంకటేశ్వరరావు, గన్నమని రాజు, గ్రామస్థులు ఉన్నారు. నిబంధనలు పాటించని వ్యాపారులపై కేసులు కొవ్వూరు, ఆగస్టు 7: ప్రభుత్వ నిబందనలు పాటించని 4గురు రైస్ వ్యాపారులపై కేసులు నమోదు చేసినట్లు ఏలూరు లీగల్ మెట్రాలజి అసిస్టెంట్ కంట్రోలర్ బి.సాయిరాం తెలిపారు. సబ్ కలెక్టర్ ఆశుతోష్ శ్రీవాస్తవ ఆద్వర్యంలో బుదవారం లీగల్ మెట్రాలజి అధికారులు కొవ్వూరు పట్టణంలో పెట్రోల్‌బంకులు, రైస్‌షాపులు, చికెన్ షాపులలో తనిఖీలు చేపట్టారు. సాయిరాం మాట్లాడుతూ కొవ్వూరు టోలిగేట్ సెంటర్‌లోని పెట్రోల్‌బంకులో సబ్ కలెక్టర్ ఆశుతోష్‌శ్రీవాస్తవ ఆద్వర్యంలో కొలతలు, నాణ్యతా ప్రమాణాలను పరిశీలించారు. ప్రభుత్వం ప్రజల సౌకర్యార్ధం ఏర్పాటుచేసిన స్పెషల్ బియ్యం, కందిపప్పు కౌంటర్లలో ఖచ్చితమైన తూకంతో వస్తువులను అందించాలన్నారు. ధరల పట్టికలు ప్రజలకు కనిపించే విదంగా ఏర్పాటుచేయాలన్నారు. కస్టమర్‌కేర్ నిభందనలు పాటించని బియ్యం వ్యాపారులపై 4 కేసులు నమోదు చేయడం జరిగిందన్నారు. కొవ్వూరు పట్టణంలో 2, నిడదవోలు పట్టణంలో 2 కేసులు నమోదు చేయడం జరిగిందన్నారు. ఈ తనిఖీలలో సబ్ కలెక్టర్ శ్రీవాస్తవ వెంట కొవ్వూరు లీగల్ మెట్రాలజి ఇన్స్‌స్పెక్టర్ జి.వి. ప్రసాద్, సివిల్ సప్లయిస్ డి.టి ఎం. సునీత సిబ్బంది పాల్గొన్నారు.