రంగంపేట మండలం వడిశలేరు గ్రామ పంచాయతీ పరిధిలో అనుమతి లేకుండా అక్రమంగా వేసిన లేఔట్‌ను బుధవారం వడిశలేరు గ్రామ పంచాయతీ కార్యదర్శి సుబ్బారాయుడు, సిబ్బంది కలిసి లేఔట్‌లో నిర్మించిన ప్రహారీ గోడలు, రోడ్లును ఎక్స్‌కవేటర్ తో పడగొట్టారు. ఈ సందర్భంగా కార్యదర్శి సుబ్బారా యుడు స్థానిక విలేకర్లతో మాట్లాడుతూ రంగంపేట మండలం వడిశలేరు పంచాయతీ పరిధిలో గల కార్గిల్ ఫ్యాక్టరీ దగ్గర ఉన్న గన్ని భాస్కరరావు పామాయిల్ తోట వెనుకగల సర్వే నెంబర్ 365/3,367,368,368/ ఎ,368/బి, 368/సి,368/డి,369,370, 371,372/2,373/ 2,374/2,375/1 లలో ఎ15.54 సెంట్లు భూమిలో 2021-22లో అనుమతిలేకుండా అక్రమంగా గరికిపాటి డెవలవపర్స్ పేరుతో లేఔట్ నిర్మించారన్నారు. తాను పంచాయతీ కార్యదర్శిగా జాయిన్ అయ్యాక ఒకటి, రెండు, మూడవసారికూడా నోటీసు జారీ చేశామన్నారు. ఈ పొలంలో వేసిన లేఔట్‌లో సంబంధిత అధికృత అధికారి అనుమతి పొందలేదని, కట్టడాలు అన్నీ 1994 ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్ట ప్రకారం నిషేధం అని సూచిక బోర్డు పెట్టామన్నారు. గరికిపాటి వెంకటేశ్వరరావు, అదర్స్ నోటీసులు జారీ చేసినా, బోర్డుపెట్టినా స్పందించకపోవడంతో 1994ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్ట ప్రకారం రుడా వారి లెటర్ ప్రకారం లేఔట్‌లోని కట్టడాలను పగలగొట్టించి, ఎక్స్‌కవేటర్‌తో రోడ్లను తొలగించామని పంచాయతీ కార్యదర్శి తెలిపారు.