పేద ప్రజలకు కడుపు నిండా అన్నం పెట్టేందుకు, 2019 ముందు చంద్రబాబు గారు అన్న క్యాంటీన్లు తెచ్చారు. మొత్తం 183 అన్న క్యాంటీన్లు ద్వారా 4 కోట్ల 60 లక్షల భోజనాలు రూ.5 కే అందించారు.చిన్న హోటల్ లో కూడా రూ.100 లేనిదే భోజనం లేని స్థితిలో, కార్మికులకు, పేదలకు, అన్న క్యాంటీన్ లో రూ.5 కే భోజనం ఉండటంతో, రూ.15 తో రోజు గడిచిపోయేది. కేవలం రూ.450తో మూడు పూటలా కడుపు నింపుకునే పరిస్థితి ఉండేది. రోజుకి కనీసం రూ.150 వరకు ఒక మనిషికి అదా అయ్యే పరిస్థితి. పేదవాడికి కనీసం ఒక కుటుంబానికి రూ.10 వేల వరకు ఖర్చులు మిగిలే పరిస్థితి. ఇలాంటి అన్న క్యాంటీన్లని 2019 తరువాత వచ్చిన జగన్ రెడ్డి ప్రభుత్వం, కర్కశంగా పేదోడి నోటి కాడ ముద్ద లాగేసింది. అన్న క్యాంటీన్లు మూసివేసింది. అన్న క్యాంటీన్ కోసం నిర్మించిన భావనలు తాగుబోతుల కేంద్రాలుగా, గంజాయి గ్యాంగ్ డెన్లుగా మార్చేసింది.