రాష్ట్రంలో ఆహారశుద్ధి, ఆక్వా రంగాల ఆధారిత ఇండస్ట్రియల్ పార్కులు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారు సూచించారు. పరిశ్రమలు, ఎంఎస్ఎఈ శాఖలపై సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సమీక్ష జరిపారు. ఈ సమావేశంలో పరిశ్రమల శాఖ మంత్రి టిజి భరత్, రాష్ట్ర ఎంఎస్ఎంఇ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్, పెట్టుబడుల శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.సురేశ్ కుమార్, పరిశ్రమల శాఖ కార్యదర్శి ఎన్.యువరాజ్, సీయం అదనపు కార్యదర్శి కార్తికేయ మిశ్రా, పరిశ్రమల శాఖ కమీషనర్ సిహెచ్.శ్రీధర్, ఎపిఐఐసి ఎండి అభిషిక్త్ కిషోర్, ఇతర అధికారులు పాల్గొన్నారు.