మాజీ మంత్రి జోగి రమేష్‌పై బీసీ నేత, శాసన మండలి మాజీ విప్ అంగర రామ్మోహన్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబసభ్యుల అవినీతి పుట్ట కదులుతోందన్నారు. విజయవాడ శివారు అంబాపురం గ్రామంలో అగ్రిగోల్డ్ భూములను జోగి కుమారుడు రాజు, వెంకటేశ్వరరావు అధికారం దుర్వినియోగంతో కొట్టేశారని ఆరోపించారు.