డోన డీఎస్పీగా పి. శ్రీనివాసులు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. సీఐడీవిభాగంలో పని చేస్తున్న శ్రీనివాసు లును డోన డీఎస్పీగా నియమిస్తూ గత నెల 31వ తేదీన రాష్ట్ర డీజీపీ ఉత్తర్వులు జారీ చేశారు. లిక్కర్ స్కామ్ కేసును రాష్ట్ర ప్రభుత్వం సీఐ డీకి అప్పగిం చడంతో ఆ కేసు విచారణలో శ్రీనివాసులు కూడా ఉన్నారు. విచారణ పూర్తి కావడంతో పట్టణంలోని డీఎస్పీ కార్యాలయంలో శ్రీనివా సులు డీఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం డోన పట్టణంలోని ఎమ్మెల్యే ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి నివాసంలో ఆయన్ను డీఎస్పీ శ్రీనివాసులు మర్యాదపూర్వకంగా కలిసి పూలబొకే అందజేశారు. అసాంఘిక కార్యకలాపాలపై దృష్టి సారించాలని డీఎస్పీకి కోట్ల సూచిం చారు. నూతన డీఎస్పీ శ్రీనివాసులును పట్టణ, రూరల్, ప్యాపిలి, బేతం చెర్ల సీఐలు ఇంతియాజ్‌బాషా, సీఎం రాకేష్, వెంకట్రామిరెడ్డి, వెంకటేశ్వ రరావులు మర్యాపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు.