విజయవాడ రాజీవ్ గాంధీ పార్క్‌లో ప్రజలకు ఆహ్లాదక రమైన వాతావరణాన్ని కల్పించాలని, పార్క్ నిర్వహణ సక్రమంగా ఉండా లని, మరింత సుందరంగా తీర్చిదిద్దా లని అధికారులు, సిబ్బందికి నగరపా లక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర సూచించారు. సోమవారం రాజీవ్‌గాంధీ పార్క్‌ను ఆయన పరిశీలించారు. పబ్లిక్, ప్రైవేట్ పార్టనర్‌షిప్ ద్వారా నిర్వహిస్తున్న ఈ పార్క్‌లో సుందరీకరణ మెరుగ్గా ఉండాలని సూచించారు. ఫౌంటెయిన్ పనిచేయకపోవటాన్ని గమ నించి వెంటనే దాన్ని మరమ్మతులు చేయాలని ఆదేశించారు. మరుగుదొడ్ల నిర్మాణాన్ని సత్వరమే పూర్తిచేసి అందుబాటులోకి తీసుకురావాలన్నారు. శని, ఆదివారాల్లో ప్రజలకు అసౌకర్యం కలగకుండా ఎంట్రన్స్ గేట్ వద్ద ఈపాస్ మిషన్‌ను పెట్టాలని సూచించారు. ఎస్టేట్ ఆఫీసర్ టి.శ్రీనివాస్, ఆర్టికల్చర్ డిప్యూటీ డైరెక్టర్ రామ్మోహన్ పాల్గొన్నారు.