మహిళా చట్టాలు పరిష్టంగా అమలు చేసి మహిళలకు భద్రత కల్పించాలని కర్నూలు ఎస్‌ఎఫ్‌ఐ యూనివర్సిటీ కన్వీనర్ రామక్రిష్ణ డిమాండ్ చేశారు. రాయలసీమ యూనివర్సిటీలో వర్శిటీ కమిటీ ఆధ్వర్యంలో యూనివర్సిటీ విద్యార్థులతో కలిసి నిరసన చేపట్టారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ డ్యూటి చేసి విశ్రాంతి తీసుకునే సమ యం లో జూనియర్ డాక్టర్‌పై ఆత్యాచారం చేయడం సమాజానికి సిగ్గుచేటన్నారు. సమాజంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళా రక్షణ కోసం ఏర్పాటు చేసి న చట్టాలన్నీ వృథా అయ్యాయన్నారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు గణేష్, అశోక్, రాజేష్, జోష్, అమర్, రాజు, రవి, ప్రవీణ్, వేణు. వివేక్ విద్యార్థులు పాల్గొన్నారు. కోల్‌కత్తా ఘటనపై ఎంపీని కలిసిన జూడాలు: కోల్ కత్తాలో జూనియర్ డాక్టర్‌పై జరిగిన ఘటనలో నిందితులను కఠినంగా శిక్షించేలా చర్యలు తీసుకోవాలని జూనియర్ డాక్టర్లు ఎంపీ బస్తిపాటి నాగరాజును కోరారు. సోమవారం ఎంపిని కలిసిన జూడాలు జూనియర్ వైద్యురాలిపై ఆత్యాచారం, హత్య కేసును సీబీఐతో దర్యాప్తు చేయించి నిందితులకు త్వరగా శిక్షపడేలా చూడాలని, పెండింగ్‌లో ఉన్న సీపిఏ యాక్టును అమలు అయ్యే లా కృషి చేయాలని కోరారు.