కోల్‌కత్తాలో జూనియర్ డాక్టర్‌పై జరిగిన హత్యాచారానికి బాధ్యత వహిస్తూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాజీనామా చేయాలని న్యాయవాదులు డిమాండ్ చేశారు. సోమవా రం సాయంత్రం జిల్లా పరిషత ఎదుట ఉన్న గాంధీ విగ్రహం ముందు న్యాయవాదులు కొవ్వొత్తులతో నిరసన చేపట్టారు. జూనియర్ డాక్టరుపై జరిగిన ఈ అత్యాచారం మానవ జాతి సిగ్గుపడేలా ఉందన్నారు. ఈఘట నకు బాధ్యత వహిస్తూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వెంటనే రాజీనామా చేయా లని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్ర మంలో బార్ అసోసియేషన అధ్య క్షుడు బి.కృష్ణమూపర్తి, ప్రధాన కార్యదర్శి బీఎస్ రవికాంత ప్రసాద్, మహిళా న్యాయవాదులు సుమనారాణి, వి.నాగలక్ష్మీదేవి, ఉమాదేవి, యువీ లక్ష్మి, జ్యోతి, ఐఏఎల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె.రంగనాథ్, పి.దస్తగిరి పాల్గొన్నారు.