రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రిలోకి పెద్ద పాము దూరడంతో రోగులు బెంబేలెత్తిపోయారు. కంటి వైద్య వార్డులో సోమవారం మధ్యాహ్నం నర్సుకు ఒక పెద్దపాము కనిపించింది. దీంతో ఆమె పెద్దగా పాము పాము అంటూ కేకలు వేస్తూ బయటికి పరుగుపెట్టింది. సమాచారం తెలియడంతో ఫెస్ట్ కంట్రోల్ విభాగం ఇన్‌చార్జ్ ఎస్.అప్పన్న అక్కడికి వెళ్లి విషయం బయటకి రానివ్వలేదు. లోపలికి ఎవరిని వెళ్లనివ్వకుండా హాస్పటల్‌లో చికిత్స పొందుతున్న ఒక రోగి బంధువు వెళ్లి ఆ పాము(జర్రిగొడ్డు)ను కొట్టి బయటపడేశాడు. దీంతో రోగులు ఊపిరిపీల్చు కున్నారు. జిల్లా ఆసుపత్రిలోకి పాము దూరడం తీవ్ర కలకలంరేపింది. నిత్యం రద్దీగా ఉండే ఆసుపత్రిలో పాము ఎలా వచ్చిందనే దానిపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.దీనిపై ఆసుపత్రి ఉన్నతాధికారులు స్పందించకపోవడం గమనార్హం.