భారత్ నుంచి అమెరికాకు వెళ్లిన ఓ డాక్టర్.. సిగ్గుమాలిన పని చేసి.. పోలీసులకు పట్టుబడ్డాడు. చిన్నారులు, మహిళలకు సంబంధించిన నగ్న ఫోటోలు, వీడియోలను రహస్య కెమెరాలతో చిత్రీకరించేవాడు. అంతేకాకుండా హాస్పిటల్‌లోని పేషంట్లు, మహిళలలు స్పృహలో లేనపుడు వారి పట్ల అసభ్యంగా ప్రవర్తించి.. వాటిని వీడియోలు తీసి దాచి పెట్టుకునేవాడు. అయితే గత కొన్నేళ్లుగా ఆ భారత డాక్టర్.. ఇలాంటి దిక్కుమాలిన పనులే చేస్తూ వచ్చాడు. కానీ చివరికి ఆ డాక్టర్ పాపం పండింది. అతడి అరాచకాలను తట్టుకోలేని భార్య.. స్వయంగా వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీంతో ఆ డాక్టర్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. ఇక అతని నివాసంలో తనిఖీలు చేపట్టగా.. ఒక్క పెన్‌డ్రైవ్‌లోనే 13 వేల నగ్న వీడియోలు వెలుగు చూడటం గమనార్హం.
భారత్‌కు చెందిన ఒయిమెయిర్ ఎజాజ్ అనే డాక్టర్ 2011లో వర్క్ వీసాపై అమెరికా చేరుకున్నాడు. మొదట అలబామా రాష్ట్రంలో ఉన్న ఒయిమెయిర్ ఎజాజ్.. ఆ తర్వాత 2018 లో మిషిగాన్ రాష్ట్రానికి మారాడు. ఈ క్రమంలోనే ఓ కంపెనీతో డీల్ కుదుర్చుకుని.. కొన్ని హాస్పిటల్‌లలో ఫిజీషియన్‌గా సేవలు అందిస్తున్నాడు. అయితే గత కొన్నేళ్ల నుంచి ఒయిమెయిర్ ఎజాజ్.. ప్రవర్తన మరీ దారుణంగా తయారైంది. తాను పనిచేసే హాస్పిటల్స్‌లో పేషంట్ రూమ్‌లు, బాత్రూమ్‌లు వివిధ ప్రాంతాల్లో ఎవరికీ కనిపించకుండా సీక్రెట్ కెమెరాలు ఏర్పాటు చేసి మహిళలు, చిన్నారుల నగ్న వీడియోలు, ఫోటోలను రికార్డ్ చేశాడు. అయితే వాటిని తట్టుకోలేక.. ఎజాజ్ భార్య చేసిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఆక్లాండ్ కౌంటీ పోలీసులు.. అతడి అరాచకాలను వెలుగులోకి తీసుకువచ్చారు.
ఇక చిన్నారులు, మహిళలు స్పృహలో లేనప్పుడు వారితో లైంగికంగా ప్రవర్తించి.. ఆ దృశ్యాలను వీడియోల రూపంలో రికార్డ్ చేసేవాడు. ఇక ఆస్పత్రికి వచ్చిన పేషెంట్లను కూడా లైంగికంగా వేధించేవాడని ఎజాజ్‌పై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇక ఈ దారుణాలు అన్నీ ఇటీవల అతని భార్యకు తెలిశాయి. దీంతో ఆమె కొన్ని వీడియోలను సేకరించి.. నేరుగా పోలీసులకు ఇచ్చి తన భర్తపైనే ఫిర్యాదు చేసింది. దీంతో ఆక్లాండ్ కౌంటీ పోలీసులు.. ఈ నెల 8 వ తేదీన ఎజాజ్‌ను అరెస్టు చేశారు. ఆ తర్వాత దర్యాప్తులో భాగంగా అతడి ఇంటిని సోదా చేయగా అవాక్కయ్యే విషయాలు వెలుగులోకి వచ్చాయి.
అతడి గదిలో ఒక కంప్యూటర్, కొన్ని సెల్‌ఫోన్లు, 15 పెన్‌డ్రైవ్‌లు, హార్డ్ డిస్క్‌లను పోలీసులు స్వాధీనం చేసుకుని.. వాటిలో చెక్ చేయగా.. వేలాదిగా వీడియోలు ఉన్నట్లు గుర్తించారు. ఒక హార్డ్ డ్రైవ్‌లోనే 13 వేల వీడియోలు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. క్లౌడ్ స్టోరేజ్‌లోనూ ఈ వీడియోలను నిందితుడు ఎజాజ్ అప్‌లోడ్ చేసి ఉంటాడని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీంతో అతడిపై కేసు నమోదు చేసి.. జైలుకు పంపించారు. ఎజాజ్ బాధితుల సంఖ్య వేల సంఖ్యలో ఉందని.. ఈ వ్యవహారంపై సమగ్రంగా దర్యాప్తు చేయడానికి కొన్ని నెలల సమయం పట్టవచ్చని పోలీసులు వెల్లడించారు.