వైద్యుల భద్రతకు సెంట్రల్ ప్రొటెక్షన యాక్టును అమలు చేయాలని జన విజ్ఞాన వేదిక వ్యవ స్థాపకుడు డాక్టర్ వీ. బ్రహ్మారెడ్డి డిమాండ్ చేశారు. గురువారం కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో కోల్‌కత్తా వైద్యురాలి హత్యను నిరసిస్తూ జూనియర్ డాక్టర్లు చేపట్టిన రిలే దీక్షలకు జన విజ్ఞాన వేదిక సంఘీభావం ప్రకటించింది. జూడాలకు మద్దతుగా డా. బ్రహ్మారెడ్డి సభ్యులు రిలే దీక్షల్లో కూర్చున్నారు. ఈ సందర్భంగా డా. బ్రహ్మారెడ్డి మాట్లాడుతూ కొత్త చట్టాల తో కాలయాపన చేయరాదని ఉన్న చట్టాల్లో అత్యధిక శిక్ష ఏది ఉంటే దాని అమలు చేయాలని కోరారు. సమాజంలో పురుషాధిక్యం ఉందని, పురుషు ల్లో స్త్రీల పట్ల వారి దృక్పథంలో మార్పు రావాలని అప్పుడే అత్యాచారాలకు అడ్డుకట్ట పడుతుందన్నారు. కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షుడు బర్మా సురేష్ కుమార్, జాతీయ నాయకులు మహ్మద్ మియా, శేషాద్రిరెడ్డి, రామలక్ష్మణ్, న్యాయవాది, శంకర్‌రావు, సుజాత, వీరేష్ తదితరులు పాల్గొన్నారు.