వచ్చే నెల 11నుంచి ఉచిత ఇసుక విధానాన్ని పగడ్బందీగా అమలు చేయడానికి కొత్త మార్గదర్శకాలు అమలులోకి రానున్నాయని, ప్రభుత్వం విధానం ప్రకారం ఉచిత ఇసుకలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా కేవలం పరిపాలనాపరమైన చార్జీలు చెల్లించి, రవాణా చార్జీలు పెట్టుకుని ఇసుకను పొందవచ్చని రాజమహేంద్రవరం జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి తెలిపారు. స్థానిక కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో గురువారం ఆమె ఎస్పీ నరసింహ కిశోర్, జేసీ ఎస్.చినరాముడుతో కలసి విలేకర్ల సమావేశంలో మా ట్లాడారు. ప్రస్తుతం జిల్లాలో పెండ్యాల, పందలపర్రు గ్రామాల్లోనే ఇసుక స్టాక్ పాయింట్లు ఉన్నాయని, ఇక్కడ రోజుకు 120 లారీలు లోడ్ చేసుకోవచ్చన్నారు. ఉదయం 6 గంటల నుంచి సాయంకాలం 6 గంటలవరకూ మాత్రమే ఇసుక సరఫరా చేస్తారన్నారు. పెండ్యాల స్టాక్ పాయింట్‌లో 98వేల టన్నులు, పందలపర్రులో 35వేల టన్ను ఇసుక ఉందన్నారు. కొత్తగా 9 పాయింట్లు గుర్తించామని, ఇంకా కొన్ని అనుమతులు రావలసి ఉందని, ఇరిగేషన్ శాఖ అధ్వర్యంలో వారంలో అవి మొదలు పెడతామన్నారు. డీసిల్టేషన్‌ను బోట్స్‌మన్ సొసైటీల ద్వారా చేపడతామని చెప్పారు. ఇంతవరకూ కొన్ని లోపా లు జరిగినట్టు తమ దృష్టికి వచ్చిందని, ఏ అక్రమాలు లేకుండా కఠి నంగా వ్యవహరిస్తామన్నారు. అక్టోబరు 15 నుంచి అన్ని ర్యాంపులు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. ఈసారి ఇంటి అడ్రస్ కూడా ఇవ్వాలని, ఇసుక అక్కడకు చేరిందా లేదా అనేది కూడా చూస్తామ ని, వినియోగదారుడు కొత్త ఇల్లు కడుతున్నాడా, రిపేర్లా అనే విష యం కూడా నమోదు చేస్తామన్నారు. ఎస్పీ నరసింహకిశోర్ మాట్లా డుతూ ట్రక్ షీట్ ఉంటేనే లారీలను అనుమతిస్తామన్నారు. ఇసుక, అక్రమనిల్వలు, అక్రమరవాణా, మధ్యవర్తుల ప్రమేయం, నివారించ డానికి పటిష్టమైన నిఘా పెడుతున్నామన్నారు. రీచ్‌ల్లోకి అనుమతి పొందిన వాహనాలను మాత్రమే అనుమతిస్తామన్నారు. క్యూ కడితే చర్యలు తీసుకుంటామని కేసులు నమోదు చేస్తామని చెప్పారు.