కడప జిల్లా, మదనపల్లె పట్టణంలోని ఓ చిన్న పిల్లల ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స కోసం తీసుకొచ్చిన చిన్నారి మూడు గంటల్లోనే మృతి చెందడంతో, చిన్నారి తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్యుల నిర్లక్ష్యంతోనే తమ బిడ్డ మృతి చెందాడని ఆరోపిం చారు. వివరాలు.. కర్ణాటక రాష్ట్రం చేలూరుకు చెందిన శంకర, నీలమ్మ కూలిపనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. నీలమ్మకు మూ డో కాన్పులో మగబిడ్డ పుట్టాడు. ఈ బిడ్డకు ప్రణీత అని పేరుపెట్టి అల్లారుముద్దుగా పెంచుతున్నారు. కాగా ప్రణీతకు నాలుగో నెల పడటంతో స్వల్ప అనారోగ్యానికి గురయ్యాడు. చేలూరులో వైద్యుల సలహా మేరకు ప్రణీతను శంకర, నీలమ్మలు మదనపల్లె పట్టణానికి తీసుకొచ్చారు. స్థానిక మార్పురివీధిలోని ఓ ప్రైవేటు చిన్నపిల్లల ఆస్పత్రిలో శనివారం సాయంత్రం 6గంటలకు చేర్చారు. ఇక్కడి వైద్యులు ప్రణీతకు ఎక్స్‌రే పరీక్షలు చేయడంతో పాటు రక్తపరీక్షలకు రక్తసేకరణ చేశారు. ఇంతలో నీలమ్మ చెల్లెలు గౌతమి చేతిలో వున్న ప్రణీత ఉన్నట్టుండి కళ్లుతేలేసి మృతి చెందాడు. తమ బిడ్డను వైద్యులే ఏదో చేసేశారని శంకర, నీలమ్మలు బోరున విలపించారు. అక్కడే వున్న కొందరు డయల్ 100కు ఫోన చేయడంతో పోలీసులు వచ్చి జరిగిన సంఘటనపై బాధితులను, వైద్యుడిని విచారించారు. ఈ సందర్భంగా వైద్యుడు డాక్టర్ అనిల్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ ప్రణీత జన్యులోపాలతో పుట్టాడని, దీని వలన అనారోగ్యం పాల య్యాడన్నారు. చేలూరు వైద్యుల సలహా మేరకు ఇక్కడికి తీసుకొచ్చా రని, తాము ప్రణీతకు వైద్యపరీక్షలు నిర్వహించామని, వ్యాధి నిర్దార ణ చేసేలోపలే చిన్నారి మృతి చెందాడన్నారు. ఇందులో తమ తప్పు లేదని స్పష్టం చేశారు. దీంతో చేసేదేమి లేక చిన్నారి మృతదేహాన్ని శంకర, నీలమ్మ స్వగ్రామానికి తీసుకెళ్లిపోయారు.