ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో 19,383 హెక్టార్లలో ఆయిల్‌పామ్ సాగు చేస్తున్నారని ఏపీఎంఐపీ పీడీ దుర్గేష్ అన్నారు. కోరుకొండ మండలంలోని గాదరాడ గ్రా మంలో శనివారం జిల్లా ఉద్యానవనశాఖ ఆధ్వర్యంలో ఆయిల్‌పామ్‌తోట విస్తరణ మహోత్సవం 2024 ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీ ఎం ఐడీ డైరెక్టర్ మాట్లాడుతూ రాజానగరం నియోజకవర్గంలో 12,500 ఎకరా ల్లో ఆయిల్‌ఫామ్ తోటలు విస్తరించి ఉన్నాయన్నారు. 3లక్షల టన్నులు ఉత్పత్తి అవుతుంది. 28వేల మంది రైతులు ఆయిల్‌పామ్ సాగుచేస్తున్నారు. ఒక టన్ను ఆయిల్ పామ్ గెలకు 180 టన్నుల ఆయిల్ దిగుబడి వస్తోంది. రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ సతీమణి బత్తుల వెంకటలక్ష్మి మాట్లాడుతూ ఆయిల్‌పామ్ తోటల విస్తరణ మహోత్సవంను గాదరాడ ఓం శివశక్తిపీఠం కల్యాణమండపం వద్ద నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. ఈ సందర్భంగా రైతులకు ఆయిల్‌పామ్ మొక్కలు అందించారు. రైతులు పంట సాగుచేయడానికి ఆధునిక యంత్రాలు, పరికరాలు పట్ల అవగాహన కల్పించేందుకు ఈ సదస్సులో యంత్రాల ప్రదర్శన ఎంతగానో ఉప యోగపడిందన్నాయి. ఆయిల్‌ఫామ్ తోటల పెంపకంలో రైతులు మారుతున్న కాలానికి అనుగుణంగా ఆధునిక పద్దతులు అవలంభిస్తు అధిక దిగుబడులు పొందాలని కోరారు. ఈ సమావేశంలో జిల్లా ఉద్యానశాఖ అధికారి పి.సుజాతకు మారి, పతంజలి పుడ్స్ లిమిడెట్ జీఎం పట్టాభిరామిరె డ్డి, డిప్యూటీ జీఎం ఏఎస్ ప్రకాష్, గాదరాడ సర్పంచ్ దూది కాంతారావు, ఎంపీటీసీ బలిరెడ్డి రాజు, ఆయిల్‌ఫామ్ రైతు సంఘం అధ్యక్షుడు బీవీవీ సత్యనారాయణ, ఎం.గంగాధర్, దాసరి తమ్మన్నదొర, పి.గంగబాబు, మండల ఉద్యాన అధికారిణి, రైతులు పాల్గొన్నారు.