కర్ణాటకకు చెందిన ఓ మాజీ ముఖ్యమంత్రిపై ఆ రాష్ట్రానికి చెందిన ప్రముఖ లాయర్ సంచనల ఆరోపణలు చేశారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నంది హిల్స్‌లోని గెస్ట్‌హౌస్‌లో పలువురు యువతులతో రాసలీలలు సాగించారని కర్ణాటక న్యాయవాది జగదీశ్ ఆరోపించారు. ఇందుకు సంబంధించిన ఆధారాలు తన దగ్గర ఉన్నాయని ఆయన.. మాజీ సీఎంపై చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టులో కేసు దాఖలు చేస్తానని స్పష్టం చేశారు. బెంగళూరులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో లాయర్ జగదీశ్ మాట్లాడుతూ.. . ‘ఆయన’ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఇద్దరు మంత్రులతో కలిసి తరచూ నందిబెట్ట గెస్ట్‌హౌస్‌కు వెళ్లేవారని అన్నారు.
ఆ మంత్రుల్లో ఒకరు ఇప్పుడు ఎంపీగా ఉన్నారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఒక నటితో పాటు, పలువురు మోడళ్లతో కామకలాపాలు సాగించి, తమ లైంగిక వాంఛలను తీర్చుకునేవారని ఆయన చెప్పారు. కొంత మంది దళారులు తమ పనుల కోసం అమ్మాయిలను సరఫరా చేసి ఫైల్స్‌పై సంతకాలు పెట్టించుకునేవారని లాయర్ ఆరోపించారు. ఈ వ్యవహారం వెనుక 20 మంది అధికారుల పాత్ర కూడా ఉందన్న లాయర్ జగదీశ్.. కొద్ది రోజుల్లో ఆ నాయకులు, అధికారుల పేర్లు బయటకు వస్తాయని ఆయన తెలిపారు. దీంతో కన్నడ నాట మరో రాజకీయ సంచలనానికి తెరలేస్తుందా? అనే చర్చ మొదలైంది. ఇంతకీ ఆ ముఖ్యమంత్రి ఎవరు? ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ నటి ఎవరు? అని గుసగుసలాడుకుంటున్నారు.
ఇదిలా ఉండగా, కర్ణాటక రాజకీయాల్లో ఇలాంటి సర్వసాధారణం. లోక్‌సభ ఎన్నికల సమయంలో మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక అఘాయిత్యాల వీడియోలు వెలుగులోకి రావడంతో కన్నడ రాజకీయాలకు కుదిపేసింది. వందల మంది యువతులపై అత్యాచారాలకు పాల్పడి.. వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో అరెస్టయిన ప్రజ్వల్.. ప్రస్తుతం జైల్లోనే ఉన్నారు. కాగా, మూడేళ్ల కిందట యువతికి ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి ఆమెను లొంగదీసుకున్నారని ఆరోపణలు రావడంతో అప్పటి కర్ణాటక జలవనరుల మంత్రి రమేశ్ జార్ఖిహోళి తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.