ఆంధ్రప్రదేశ్‌లో సామాజిన పింఛనుదారులకు ఊహించని శుభవార్త వచ్చింది. ఒకరోజు ముందుగానే పెన్షన్లు పంపిణీ చేయనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. సెప్టెంబర్ నెల సామాజిక పెన్షన్లను ఆగస్టు 31నే (శనివారం) అందించనున్నట్టు పేర్కొంది. సెప్టెంబర్ 1న ఆదివారం సెలవు దినం కావడంతో ఒక రోజు ముందుగానే పెన్షన్లు అందజేయాలని సర్కారు నిర్ణయించింది. ఆదివారం నాడు ఉద్యోగులకు సెలవు దినం కావడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఏ కారణంగానైనా ఆగస్టు 31న పింఛన్ అందుకోలేనివారికి సెప్టెంబర్ 2వ తేదీన (సోమవారం) అందరికీ అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేయనుంది. కాగా ప్రతి నెలా 1వ తేదీన ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను కూటమి ప్రభుత్వం విజయవంతంగా పంపిణీ చేస్తోంది. పెన్షన్ల పంపిణీలో ప్రతి నెలా రికార్డులు తిరగ రాస్తున్న విషయం తెలిసిందే.