రాష్ట్రంలో గణేష్ మండపాలకు ఆన్‌లైన్‌లో అనుమతులు మంజూరు చేస్తున్నామని డీజీపీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా అనుమతి పొందాలన్నారు. ATM దోపిడీలకు సంబంధించి ఇతర రాష్ట్రాలకు చెందిన ముఠాల ప్రమేయం ఉన్నట్లు తేలిందని.. ఇటీవల అనంతపురంలో రెండు బృందాలను పట్టుకున్నట్లు చెప్పారు. గంజాయి నియంత్రణ కోసం డ్రోన్ లు, ప్రత్యేక నిఘా కెమెరాలు, స్నిఫర్ డాగ్స్‌ను ఉపయోగిస్తున్నామని.. గంజాయి నియంత్రణకు అన్ని రకాల చర్యలు చేపడుతున్నామన్నారు. పోలీసు శాఖలో నిధుల కొరత కారణంగా కొన్ని కీలక విభాగాలు మూలన పడ్డాయని, ఫింగర్ ప్రింట్స్, సీసీ కెమెరాల ఎఎంసిలకు నిధులు లేక ఇబ్బందులు ఎదురయ్యాయని డీజీపీ తెలిపారు. కేంద్రం ఇచ్చే మ్యాచింగ్ గ్రాంట్ గత మూడేళ్లలో విడుదల కాలేదని, దాని కారణంగా సమస్యలు ఎదురయ్యాయని పేర్కొన్నారు. ఇటీవల పెండింగ్ బిల్లులు రిలీజ్ చేస్తూ ముఖ్యమంత్రి చొరవ తీసుకున్నారని డీజీపీ తెలిపారు.