సెప్టెంబర్ 1వ తేదీ ఆదివారం కావడంతో ఒక రోజు ముందుగానే అంటే ఈనెల 31వ తేదీన పెన్షన్ల పంపిణీ చేయాలన్న ప్రభుత్వ ఆదేశాలను పకడ్భందీగా అమలు చేయాలని సూచించారు. అదే రోజు నూరు శాతం పింఛన్లు పంపిణీకి కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ పీడీ, మున్సిపల్ కమిషనర్లు, లీడ్ బ్యాంక్ మేనేజర్, జీఎస్‌డబ్ల్యూఎస్ నోడల్ అధికారి, తదితరులకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. మండల స్థాయి ప్రత్యేక అధికారులు పర్యవేక్షించాలనీ, ఎక్కడ ఇబ్బందులు లేకుండా చూసుకోవాలనీ చెప్పారు. మొదటి రోజే వంద శాతం పెన్షన్ల పంపిణీ పూర్తి చేయాలని లక్ష్యంగా చేసుకుని పనిచేయాలని సూచించారు. పింఛను లబ్ధిదారులు సిబ్బందికి అందుబాటులో ఉండాలని కోరారు.