ప్రభుత్వపాఠశాలల్లో నాడు-నేడు పనుల్లో నిధుల దుర్విని యోగంపై విచారణ నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే కూన రవికుమార్ తెలిపారు. గురువారం పొందూరులో ఎంపీపీ కిల్లి ఉషారాణి అధ్యక్షతన జరిగిన మండల సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాడు-నేడు పేరుతో వైసీపీ ప్రభుత్వంలో జరిగిన నిధులు దుర్వినియోగంపై సీఐడీ, విజిలెన్స్ విచారణ జరగనుందని, బాధ్యులైన హెచ్‌ఎంలు, అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. రాష్ట్రంలో నకిలీ, తప్పుడు దివ్యాంగ ధ్రువపత్రాలతో పొందుతున్న పింఛన్లపై విచారణకు ప్రభుత్వం ఆదేశించిందని ఎమ్యెల్యే తెలిపారు. ఎరువుల స్టాకు విషయంలో వ్యవసాయశాఖ నిర్లక్ష్యంగా ఉంటోందని ఏవో బాబ్జిని మంద లించారు. పరిశ్రమల ఏర్పాటకు ప్రజాప్రతినిధులు, రైతులు సహకరిస్తే మండలంలో 1000 ఎకరాల్లో రూ.10వేల కోట్లతో ఽథర్మల్‌పవర్‌స్టేషన్ ఏర్పాటు జరిగేలా చూ స్తానన్నారు. కార్యక్రమంలో ఎంపీటీసీలు కూన ప్రమీల, చల్లమాంబ, ఎల్. రాజప్పడు, కె. హనుమంతురావు, సర్పంచ్‌లు పి. ప్రసాద్, పి. వేణుగోపాల్, జాడ శ్రీనివాసరావు, తహసీల్దార్ రమేష్ పాల్గొన్నారు.