బంగ్లాదేశ్ ఈశాన్య ప్రాంతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఉత్తర బంగాళాఖాతంలో శుక్రవారం అల్పపీడనం ఏర్పడనుంది. ఇది పశ్చిమ వాయవ్యంగా పయనించి 15వ తేదీకల్లా బెంగాల్‌కు ఆనుకుని వాయవ్య బంగాళాఖాతంలో ప్రవేశించి వాయుగుండంగా బలపడుతుందని వాతావరణ శాఖ తెలిపింది. కాగా, గురువారం రాష్ట్రంలో అనేకచోట్ల ఎండ తీవ్రత కొనసాగింది. కావలిలో 38.2 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. రానున్న 24 గంటల్లో ఉత్తర కోస్తాలో పలుచోట్ల, దక్షిణ కోస్తా, రాయలసీమల్లో చెదురుమదురుగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.