వరద బాధితుల కోసం ముఖ్యమంత్రి సహాయ నిధికి దాతలు భారీగా విరాళాలు అందిస్తున్నారు. పలువురు పారిశ్రామికవేత్తలు, సినీనటులు, రాజకీయ నాయకులు గురువారం అమరావతి సచివాలయంలో సీఎం చంద్రబాబును కలసి విరాళాల చెక్కులు అందజేశారు. విరాళాలిచ్చిన దాతలకు సీఎం ధన్యవాదాలు తెలిపారు. రెడ్డి ల్యాబ్స్ ప్రతినిధి నారాయణరెడ్డి రూ.5 కోట్లు, ఆంధ్ర షుగర్స్ లిమిటెడ్ తరఫున పెండ్యాల అచ్యుత రామయ్య రూ.2 కోట్లు, పర్చూరు నియోజకవర్గానికి చెందిన విక్రం నారాయణరావు కుటుంబం రూ.1,55,55,555, వసుధా ఫార్మా వెంకటరాజు రూ.కోటి, ఏపీ క్రెడాయ్ తరఫున వైవీ రామారావు రూ.50 లక్షలు, వెంకట్ అక్కినేని రూ.50 లక్షలు, శివశక్తి బయోటెక్ చైర్మన్ నందిగామ శ్రీనివాసరావు, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు రూ.50 లక్షలు, మైసూరు గణపతి సచ్చిదానంద ఆశ్రమం రూ.25 లక్షలు, కోనేరు విమలాదేవి రూ.25 లక్షలు, కోనేరు ప్రదీప్ రూ.25 లక్షలు, ఆర్కే ఇన్‌ఫ్రా కార్పొరేషన్ రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి రూ.20 లక్షలు, ఫ్రాంక్విన్ ఫార్ములేషన్స్ సాగి కృష్ణంరాజు రూ.15 లక్షలు, మంత్రి రామ్‌ప్రసాద్‌రెడ్డి ద్వారా ది కాంట్రాక్ట్ క్యారేజీ బస్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రూ.15 లక్షలు, అన్నమయ్య జిల్లా టీడీపీ శ్రేణుల నుంచి తంబళ్లపల్లి ఇన్‌చార్జి జయచంద్రారెడ్డి రూ.15 లక్షలు, సింహ మోటార్స్ రావెళ్ల సతీష్ రూ.10,00,116, బొబ్బా గోపాలకృష్ణ, పువ్వాడ సుధాకర్‌రావు, వాస్తవ్య ప్రమోటర్స్ అండ్ డెవలపర్స్ రూ.10 లక్షలు, వికాస్ పబ్లిక్ స్కూల్ రూ.5 లక్షలు, విశ్వం ప్రభాకర్‌రెడ్డి, లక్ష్మీ రష్ హెల్త్‌కేర్, కోగంటి వెంకటరామయ్య, డాక్టర్ ఇండ్ల రామసుబ్బారెడ్డి ఐదేసి లక్షలు, వాసిరెడ్డి సుగుణకుమారి రూ.3 లక్షలు, దళవాయి వడ్డే సిమెంట్ పుల్లన్న రూ.2 లక్షలు, ఎన్టీఆర్ కుటీరం తరఫున ఆర్ శివాజీ రూ.లక్ష చెక్కులు అందజేశారు.