వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్ కు మంగళగిరి కోర్టు పోలీస్ కస్టడీ విధించింది. టీడీపీ ప్రధాన కార్యాలయంపై దాడి కేసులో నందిగం సురేశ్ ను ఇటీవల మంగళగిరి పోలీసులు అరెస్ట్ చేయడం తెలిసిందే. ఈ నేపథ్యంలో, మంగళగిరి కోర్టు నందిగం సురేశ్ ను రెండ్రోజుల పోలీస్ కస్టడీకి అనుమతించింది. ప్రస్తుతం నందిగం సురేశ్ గుంటూరు జిల్లా జైలులో ఉన్నారు. కోర్టు ఆదేశాల మేరకు ఆయనను పోలీసులు జైలులోనే విచారించనున్నారు. ఈ కేసులో నందిగం సురేశ్ తో పాటు విజయవాడ డిప్యూటీ మేయర్ శైలజ భర్త శ్రీనివాసరెడ్డిని కూడా పోలీసులు అరెస్ట్ చేయడం తెలిసిందే. నందిగం సురేశ్ ప్రకాశం బ్యారేజి గేట్లను బోట్లు ఢీకొట్టిన ఘటనలోనూ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.