సింహాచలం వరాహ నరసింహస్వామిని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు శనివారం ఉదయం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్టీల్ ప్లాంట్ వ్యవహారంలో రాజ్యసభ సభ్యులు విజయసారెడ్డి చేసిన ట్విట్‌పై ఎమ్మెల్యే స్పందించారు. విజయసాయిరెడ్డి పరిస్థితి దురదృష్టకరంగా మారిందన్నారు. ప్రతి దాన్ని రాజకీయం చేయడం ఆయనకు అలవాటుగా మారిపోయిందని విమర్శించారు.గత ప్రభుత్వంలో తాను స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై స్పీకర్ ఫార్మేట్‌లో రాజీనామా చేశానని తెలిపారు. ఇందులో ఎటువంటి సందేహం లేదన్నారు. స్పీకర్ ఆమోదించడం కూడా జరిగిందన్నారు. అప్పుడు అధికారంలో ఉన్న వైసీపీ పార్టీ ఎంపీగా ఉన్న విజయ్ సాయి రెడ్డి రాజీనామా చేయలేదన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే స్టీల్‌ప్లాంట్‌పై ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ధ కనబరిచారన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌కు కేంద్రమంత్రి కుమారస్వామిని రప్పించి... స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాదని స్పష్టం చేశారని తెలిపారు.