విజయవాడ ఎయిర్ పోర్ట్‌లో కొత్త రోడు ప్రారంభించడం జరిగిందని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ... మైసూర్ ఎంపీ యువరాజ్ ఈ కార్యక్రమానికి రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. దేశంలో చాలా ఎయిర్‌పోర్టులు ఉన్నా కానీ గన్నవరం ఎయిర్పోర్ట్‌పై దృష్టి పెట్టినట్లు తెలిపారు. అమరావతి ఉన్న ఏరియాలో ఎయిర్‌పోర్టు అభివృద్ధి ఉండాలన్నారు. ఇది అంతం కాదు ఆరంభం మాత్రమే అనిస్పష్టం చేశారు. వచ్చే నెల నుంచి కొత్త సర్వీసులు ప్రారంభించబోతున్నట్లు తెలిపారు.విజయవాడ నుంచి ఇంటర్నేషనల్ కనెక్షన్ పెంచడానికి ఆలోచిస్తున్నామన్నారు. కూటమీ ప్రభుత్వ ఏర్పడిన తర్వాత లక్ష ప్యాసింజర్లు పెంచడం జరిగిందన్నారు. దేశంలో ఉన్న అందరూ ఆంధ్ర వైపు చూసే విధంగా ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఎయిర్ పోర్ట్‌ను కేంద్రంగా వాడుకునే విధంగా ఏర్పాట్లు చేపడుతున్నామన్నారు. 157 ఎయిర్‌పోర్టులు కట్టిన ఘనత నరేంద్ర మోడీ దే అని కొనియాడారు. నరేంద్ర మోడీ స్ఫూర్తితో ఎన్నో మంచి కార్యక్రమాలు చేపట్టడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. భారతదేశంలో ఉన్న యువతరంపై మోడీ చాలా నమ్మకం పెట్టుకున్నారన్నారు. అమ్మ పేరుతో ప్రతి ఒక్కరు ఒక మొక్క నాటాలని మోడీ పిలుపునిచ్చారన్నారు. కొత్త టెర్మినార్ భవనం గత ప్రభుత్వంలో ఆలస్యంగా నడిచిందన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త టెర్మినల్ భవనం పనులు వేగంగా జరగాలని చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారన్నారు. ఈ సర్వీసులను ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని కోరుతున్నట్లు కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు.