ఏపీలోని బాపట్ల జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. కర్లపాలెం మండలం లంకకట్ట కాలువ సమీపంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కాలువ సమీపంలో నివాసం ఉంటున్న పేదల గుడిసెలు ఈ ప్రమాదంలో అగ్నికి ఆహుతయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పైర్ సిబ్బంది.. మంటలను ఆర్పేశారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు. అయితే ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa