గత వైసీపీ పాలనలో మండలంలో విచ్చలవిడిగా భూ ఆక్రమణలకు పాల్పడ్డారని ఎమ్మెల్యే పరిటాలసునీత విమర్శించారు. వారి చిట్టా తమవద్ద ఉందని, త్వరలో వారి ఆటకట్టిస్తామన్నారు. ఇది మంచి ప్రభు త్వం కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే బుధవారం మండలంలోని ప్యాధిండి, చందమూరు, ఎనఎస్‌గేటు, చెన్నేకొత్తపల్లి, హరియన చెరువు గ్రామాల్లో పర్యటించారు. రూ.3.60 కోట్లతో చేపడుతున్న సీసీరోడ్ల నిర్మాణానికి భూమిపూజ చేశారు. చెన్నే కొత్తపల్లిలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ... మండలంలో జరిగిన భూ ఆక్రమణలపై ప్రత్యేకంగా విచారణచేయించి బాధ్యులు ఎంతటివారైనా చర్యలు తీసుకుంటమన్నారు. బాధితులకు తిరిగి ఇప్పిస్తామన్నారు.
అలాగే చందమూరులో పొలం పిలుస్తోంది కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. హరియనచెరువులో బ్లాక్ ప్లాంటేషన కార్యక్రమం కింద మొక్కలను నాటారు. ఎమ్మెల్యేకు పలువురు సమస్యలపై వినతిపత్రా లు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఇనచార్జ్ ఎంపీడీఓ అశోక్‌నాయక్, తహసీల్దార్ సురేశకుమార్, ఏఓ ఉదయ్‌కుమార్, పంచాయతీరాజ్ డీఈ లక్ష్మీనారాయణ, ఎంఈఓ-1,2లు మున్వర్‌బాషా, ప్రసూనకుమార్‌నాయుడు, టీడీపీ సీనియర్ నాయకులు ఎల్‌నారాయణచౌదరి, బీసీసెల్ జిల్లా అధ్యక్షుడు రంగయ్య, టీడీపీ మండల కన్వీనర్ ముత్యాల్‌రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు దండు ఓబుళేశు, జనసేన కన్వీనర్ క్రాంతికుమార్, బీజేపీ నాయకుడు జిలకర ఆంజనేయులు, పలువురు అధికారులు పాల్గొన్నారు.