రానున్న దసరా పండుగలోగా రాష్ట్ర ప్రభుత్వం రైతులకు 2023 ఖరీఫ్, రబీ ఇన్సూరెన్స ప్రకటించాలని ఏపీ రైతు సంఘం అనంతపురం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్‌రెడ్డి పేర్కొన్నారు. 2023 ఖరీఫ్, రబీ ఇన్సూరెన్స ప్రకటించాలని, కౌలురైతులకు గుర్తింపు కార్డులివ్వాలనే పలు డిమాండ్ల సాధన కోసం ఏపీ రైతుసంఘం ఆధ్వర్యంలో రైతులతో కలిసి బుధవారం స్థానిక క్లాక్‌టవర్ నుంచి కలెక్టరేట్ వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ... 2023 ఖరీఫ్, రబీలో తీవ్రమైన కరువు పరిస్థితులేర్పడి, రైతులు సాగు చేసిన పంటలకు పూర్తిగా నష్టం వాటిల్లిందన్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 2023 ఖరీఫ్‌లో 28 మండలాలను, రబీలో 14 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించినా కరువు నివారణకు ఎలాంటి ప్రత్యేక నిధులు కేటాయించలేదన్నారు. 2023 ఖరీఫ్, రబీ పంట బీమా ప్ర కటించాలని, కౌలు రైతులకు గుర్తింపుకార్డులు ఇచ్చి రుణాలు, పంట నష్టపరిహారం అందజేయాలన్నారు. దసరాలోగా ఇన్సూరెన్స ప్రకటించకపోతే చలో విజయవాడ కార్యక్రం చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో కౌలురైతు సంఘం జిల్లా కార్యదర్శి బాలరంగయ్య, రైతు సంఘం జిల్లా ఉపాద్యక్షుడు శివారెడ్డి, విరూపాక్షి, రాజారాంరెడ్డి, చెన్నారెడ్డి, శ్రీనివాసులు, నల్లప్ప, సంగప్ప, పోతులయ్య, చిదంబరయ్య, వెంకటకొండ తదితరులు పాల్గొన్నారు.