ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు ఆదేశాలతో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పై కర్ణాటక పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా దోచుకున్నారన్న ఆరోపణలపై బెంగళూరు తిలక్ నగర్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ కేసులో నిర్మలా సీతారామన్ ను ప్రధాన నిందితురాలిగా పేర్కొన్నారు. ఈడీ అధికారులను ఏ2గా, బీజేపీ కేంద్ర కార్యాలయ వర్గాలను ఏ3గా, బీజేపీ మాజీ ఎంపీ నళిన్ కుమార్ కటీల్ ను ఏ4గా, కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు బీవై విజయేంద్రను ఏ5గా, కర్ణాటక బీజేపీ కార్యాలయ వర్గాలను ఏ6గా పొందుపరిచారు. కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ పై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ లో 384, 129బి, 34 సెక్షన్లను ప్రస్తావించారు. జనాధికార సంఘర్ష పరిషత్ సహ అధ్యక్షుడు ఆదర్శ్ ఆర్ అయ్యర్ ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదైంది.