శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని నంద్యాల పోలీసులు హెచ్చరించారు. ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా ఆదేశాల మేరకు శాంతిభద్రతల పరిరక్షణ, నేరరహిత జిల్లాగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ఆదివారం వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలోని హిస్టరీ షీట్లు కలిగిన వ్యక్తులను ఆయా స్టేషన్లకు పిలిపించి పోలీస్ అధికారులు కౌన్సెలింగ్ ఇచ్చారు. సత్ప్రవర్తనతో జీవించాలని, నేరప్రవృత్తికి స్వస్తి పలకాలని సూచించారు. హిస్టరీ షీట్లు కలిగిన వ్యక్తుల జీవన విధానం, జీవనోపాధికై వారు చేస్తున్న వృత్తులపై పోలీస్ అధికారులు ఆరా తీశారు. నిరంతరం మీ కదలికలపై నిఘా ఉంటుందని, నేరప్రవృత్తిని విడనాడకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.