శ్రీశైల మహాక్షేత్రంలో లోకకల్యాణార్థం ఆదివారాన్ని పురస్కరించుకొని స్వామి, అమ్మవార్లకు పల్లకీ ఉత్సవం ఘనంగా నిర్వహించారు. అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని ఆశీర్వచన మండపములో నిర్వహించిన ఉత్సవ కార్యక్రమం నిర్విఘ్నంగా జరగాలని మహాగణపతికి ప్రత్యేక పూజలు చేశారు. శ్రీశైల దేవస్థానం ధర్మపథంలో భాగంగా నిర్వహిస్తున్న నిత్యకళారాధన కార్యక్రమంలో ఆదివారం నెల్లూరుకు చెందిన వెంకటేశవర ఆర్ట్సు అకాడమీ బృందంచే సంప్రదాయ నృత్య ప్రదర్శన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఆల య ధక్షిణ మాఢవీధిలోని నిత్య కళారాధన వేదిక వద్ద నిర్వహించిన కార్యక్రమంలో గణపతిస్తుతి, ఓం నమఃశివాయ,శివతాండవ స్తోత్రం, అఖిలాండేశ్వరి తదితర గీతాలకు మీనాక్షి, కీర్తి, వైష్ణవి, శ్రావణి, భువనేశ్వరి, భవ్య, తేజస్విని, హర్షిణి, చక్రక, పూర్వత, నాగరికత, గీతిక, మేఘన నృత్యప్రదర్శనతో అలరించారు.