స్వతంత్ర సిట్ ఏర్పాటు చేయడం స్వాగతిస్తున్నామని మాజీ దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. చంద్రబాబు వంద రోజుల పరిపాలన ఫెయిల్యూర్‌ని కప్పిపుచ్చుకొని లడ్డూ రాజకీయం చేశారు. సుప్రీంకోర్టు ధర్మాసనం కోట్లాది మంది హిందువుల మనోభావాలు నిలబెట్టింది. దుర్మార్గుడైన ముఖ్యమంత్రి రాజకీయ క్రీడలకు ఇది చెంపపెట్టు.
లడ్డూ వివాదంపై ఇప్పటికైనా ప్రభుత్వం పుల్ స్టాప్ పెట్టి సుప్రీంకోర్టు నిర్ణయానికి కట్టుబడి ఉండాలి. స్వతంత్ర సిట్ కమిటీ చంద్రబాబు పవన్ కల్యాణ్‌లను కూడా విచారణ చేయాలి. కల్తీ లడ్డూలు అయోధ్య రామలయానికి కూడా పంపారంటూ పవన్ వ్యాఖ్యానించారు. ఏ ఆధారాలతో ఇలాంటి వ్యాఖ్యలు చేశారు.? ఎవరు స్క్రిప్ట్ ఇస్తే ఆ స్క్రిప్టు మాట్లాడుతున్నాడు. సనాతన ధర్మంలో బ్రాహ్మణ ఇతరులు సైతం కూడా ఆచరించే ఆగమాలు సైతం ఉన్నాయి. సనాతన ధర్మంపై పవన్ మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్నాడు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలి’’ అని కొట్టు సత్యనారాయణ డిమాండ్ చేశారు.