ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బంగారు ఆభరణాలను కోర్టుకెళ్లి సాధించిన టీటీడీ.. ఇంట్రెస్టింగ్ కేసు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Oct 05, 2024, 07:11 PM

టీటీడీకి సంబంధించి ఓ బీమా కేసు చర్చనీయాంశంగా మారింది.. తిరమల తిరుపతి దేవస్థానం కోర్టుకు వెళ్లి మరీ సాధించింది. గత నెల 30న టీటీడీకి బీమా పరిహారం చెల్లించాలని తిరుపతి జిల్లా వినియోగదారుల ఫోరం బెంచ్‌ ఉత్తర్వులు జారీ చేసినట్లు టీటీడీ తరఫు లాయర్ కె రాజేష్‌ తెలిపారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. టీటీడీకి సంబంధించిన ఆలయాల్లోని బంగారు ఆభరణాలకు బీమా చేయిస్తారు.. అయితే యునైటెడ్‌ ఇండియా బీమా సంస్థ ద్వారా ఆభరణాలకు బీమా చేయించారు


2009లో తిరుపతిలోని శ్రీకోదండరామస్వామి ఆలయంలోని నగలు దొంగతనం జరిగింది. దీనిపై అప్పుడే తిరుపతి పడమర పోలీసుస్టేషన్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చోరీ చేసిన కొన్ని నగలు రికవరీ చేయగా.. రూ.2,43,480 విలువైన నగలను మాత్రం పోలీసులు రికవరీ చేయలేకపోయారు. అయితే బీమా సంస్థ పాలసీ ప్రకారం డబ్బులు చెల్లించాల్సిందిగా టీటీడీ బీమా సంస్థని కోరింది. కానీ ఆ బీమా సంస్థ నిరాకరించటంతో వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు దాఖలు చేశారు. అయితే ఈ వ్యవహారంలో సేవా లోపానికి పాల్పడిన బీమా సంస్థ టీటీడీకి బీమా పరిహార రూ.2,43,480తో పాటుగా సేవా లోపం కింద రూ.లక్ష, రూ.10వేలు ఫిర్యాదు దాఖలు ఖర్చు 45రోజుల్లో చెల్లించాలని ఆదేశించింది.


తిరుమల భక్తులకు భ‌క్తి శ్ర‌ద్ధ‌ల‌తో సేవలు


శ్రీవారి సేవకులు ప్రతి భక్తునిలో శ్రీవేంకటేశ్వర‌స్వామివారిని ద‌ర్శిస్తూ, అత్యంత భక్తి, అంకితభావంతో, క్రమశిక్షణతో ఉత్తమమైన సేవలను అందించాలని టీటీడీ ఈవో జె శ్యామలరావు కోరారు. తిరుమల ఆస్థాన మండపంలో శుక్రవారం శ్రీవారి సేవకులను ఉద్దేశించి ఈవో మాట్లాడుతూ, వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులకు సేవలందించేందుకు దాదాపు 4 వేల‌ మంది శ్రీవారి సేవకులను టీటీడీ ఆహ్వానించిందన్నారు. భక్తులకు శ్రీ‌వారి సేవ‌కులు అందిస్తున్న సేవ‌లు, ప్రత్యేకంగా అన్నప్రసాదం, తాగునీరు, లడ్డూ ప్రసాదాల పంపిణీ, శ్రీ‌వారి ఆలయం, కల్యాణకట్ట, బయటి ప్రదేశాల్లో క్యూ లైన్ల నిర్వహణ, అనేక కార్యక్రమాలలో శ్రీవారి సేవకుల సేవలను కొనియాడారు.


శ్రీవేంకటేశ్వరస్వామి అనుగ్ర‌హం లేకుండా, 4 వేల‌ మంది శ్రీవారి సేవకులు బ్రహ్మోత్సవంలో భ‌క్తుల‌కు సేవలు అందించడం కోసం ఇక్కడకు రావడం సాధ్యం కాద‌న్నారు. శ్రీవారు అందించిన ఈ దివ్య అవకాశాన్ని వినియోగించుకొని భక్తులకు నిబద్ధతతో సేవలు అందించాలని పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి శ్రీవారి సేవా వలంటీర్లు యాత్రికులకు సేవలు అందిస్తున్నారన్నారు అద‌న‌పు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి . వారి విలువైన మరియు నిస్వార్థ సేవలకు గుర్తింపుగా, టీటీడీ ఇటీవల సుపథం ప్రవేశం ద్వారా శ్రీవారి దర్శన సౌకర్యాన్ని వారికి పునరుద్ధరించింద‌ని చెప్పారు. అదేవిధంగా సేవకులను, సుదూరంగా ఉండే వారి డ్యూటీ పాయింట్‌లకు తరలించడానికి ప్రత్యేక వాహనాన్ని కూడా ఏర్పాటు చేసిన‌ట్లు తెలిపారు.


సభ ప్రారంభంలో ప్రముఖ విజిల్‌ ఆర్టిస్ట్‌, బాపట్లకు చెందిన డాక్టర్‌ కె. శివప్రసాద్‌ ప్రత్యేక సంగీత కార్యక్రమం నిర్వహించారు. గంటకు పైగా అన్నమాచార్య సంకీర్తనలు, భజనలను విజిల్ ద్వారా ఆలపిస్తూ తన అరుదైన ప్రతిభను ప్రదర్శించ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు. గత 45 ఏళ్లలో 30కి పైగా దేశాల్లో 16 వేల‌కు పైగా ప్రదర్శనలు అందించిన బహుముఖ కళాకారుడిని టిటిడి ఇఓ మరియు అడిషనల్ ఇఓ ఇద్దరూ అభినందించారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com