సీఎం చంద్రబాబు నాయుడు సొంత జిల్లాలో ఒక బాలిక కిడ్నాప్,హత్య కు గురైతే పోలీసులు పట్టించుకోలేదని మాజీ మంత్రి ఆర్కే రోజా మండిపడ్డారు. ఈ విషయమై రోజా ఆదివారం మీడియాతో మాట్లాడారు.‘చిన్నారి హత్య ఘటన విని గుండె తరుక్కుపోతోంది.ఈ కేసులో నిందితులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చిన్న పిల్లల్ని స్కూళ్లకు పంపించాలంటేనే ఆడపిల్లలు తల్లిదండ్రులు భయపడే పరిస్థితి ఉంది.బాలిక 29వ తేది కిడ్నాప్ అయితే 4రోజుల పాటు 4కిలోమీటర్ల దూరంలో పుంగనూరులో ఉన్నా పోలీసులు పట్టుకోలేకపోయారు.చంద్రబాబు,హోం మంత్రి,డిప్యూటీ సీఎం ఏం చేస్తున్నారని ప్రభుత్వ అసమర్ధత పై రోజా నిప్పులు చెరిగారు.
ముఖ్యమంత్రి సొంత చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలో ఏడేళ్ల పాప ను కిడ్నాప్ చేసి కిరాతకం గా హత్య చేసిన ఉదంతం గుండెను పిండేస్తోంది. ఆడపిల్లలు ఉన్న తల్లితండ్రులు పిల్లలను స్కూల్ కి పంపాలంటే భయమేస్తోంది. ముఖ్యమంత్రి సొంత జిల్లాలోనే రక్షణ లేకపోతే ప్రభుత్వ అసమర్ధత కాదా? అని ప్రశ్నించారు. గత నెల 29 న అదృశ్యమైన పాప నాలుగు రోజులపాటు ఆ సమీప ప్రాంతాల్లో నే ఉన్నా ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా గుర్తించలేకపోయారు. వారం తర్వాత ఇంటికి నాలుగు కిలోమీటర్ల దూరంలోనే బాలిక శవమై కనిపించిందంటే ఈ హోం, డిప్యూటీ, సీఎం లు ఏం చేస్తున్నట్టు? అని నిలదీశారు. హోంమంత్రి పక్క నియోజకవర్గంలో రాంబిల్లిలో ఒక యువతి కాపాడమని కోరినా పట్టించుకోకపోవడంతో జైలు నుంచి వచ్చి నిందితుడు చంపేశాడు. వైయస్ జగన్ మోహన్ రెడ్డి 9 వ తేదీ పుంగనూరుకు వస్తున్నాడని తెలిసి ప్రభుత్వం, హోం మంత్రి పరుగులు తీస్తున్నారు. ఇప్పటికైనా కక్ష సాధింపుతో దిశ చట్టాన్ని, మహిళా పోలీసులను నిర్వీర్యం చేయకుండా బలోపేతం చేయండి. మిమ్మల్ని కన్న తల్లి కూడా ఆడదే అని గుర్తు తెచ్చుకుని మహిళా రక్షణను పెంచండి. తక్షణం పుంగనూరు ఘటన నిందితులను తక్షణం అరెస్టు చేయాలని ఆర్కే రోజా డిమాండ్ చేశారు.