ఉచిత ఇసుక పేరుతో మోసపు ప్రకటన చేసిన చంద్రబాబు.. అధికారంలోకి వచ్చాక గతం కన్నా నాలుగు రెట్లు అధిక ధరలకు కూటమి నాయకులతో అమ్మించి వారి జేబులు నింపుతున్నారని మాజీ ఎమ్మెల్యే, వైయస్సార్‌సీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు టీజేఆర్ సుధాకర్‌బాబు ఆక్షేపించారు. ఇసుక బుక్ చేద్దామంటే వెబ్‌సైట్లు అర్థరాత్రి తప్ప పగలు పని చేయవని, రోజు రోజుకీ ఇసుక ధర పెరుగుతోందని ఆయన వెల్లడించారు. పేరుకే ఉచిత ఇసుక. కానీ లారీ లోడ్ అరకులో ఏకంగా రూ.54 వేలు ఉందని తెలిపారు. ఉచిత ఇసుక పాలసీ కారణంగా ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడిందన్న ఆయన, ఇసుక అమ్మకాల ద్వారా గత ప్రభుత్వంలో ఏటా రూ.765 కోట్ల చొప్పున ఐదేళ్లలో సుమారు రూ.3825 కోట్ల ఆదాయం వచ్చిందని తెలిపారు.