కనకదుర్గమ్మ సన్నిధిలో దసరాశరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆలయంలో పటిష్టమైన పోలీసు భద్రతను ఏర్పాటు చేశారు. అనేక మంది పోలీసులు దుర్గమ్మ సన్నిధిలో డ్యూటీ చేస్తున్నారు. అదే విధంగా నలుగురు సీఐలు కూడా దుర్గమ్మ గుడిలో డ్యూటీ చేయడానికి వచ్చారు.
తమకు ఇచ్చిన విధులు సక్రమంగా నిర్వర్తించి ఉంటే ఇంతగా వైరల్ అయ్యే స్థితికి వచ్చేది కాదేమో. విధులు నిర్వహించకుండా ఆ నలుగురు సీఐలు పేకాటాడుతూ పట్టుబడ్డారు. వీరు పేకాటాడుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి. పేకాటాడుతున్న పోలీసులను ఎవరో వీడియో తీసి సామాజిక మాద్యమంలో పోస్టు చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారిపోయింది. టూ టౌన్ సీఐ కొండలరావు, పెనుకొండ సీఐ రాయుడు, మరో ఇద్దరు సీఐలు కలిసి ఓ హోటల్‌లో పేకాట ఆడుతున్నట్లు వీడియోలో రికార్డు అయ్యింది. ఈ వీడియోలు చూసిన ప్రతీఒక్కరూ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దైవసన్నిధిలో డ్యూటీ వచ్చి ఏంటా పని అంటూ మండిపడుతున్నారు.