సరిగ్గా నెల, నెలన్నర రోజుల కిందట.. తెలుగు రాష్ట్రాల్లో హాట్‌టాపిక్‌గా మారిన దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి మరోసారి లైమ్ లైట్‌లోకి వచ్చారు. సోమవారం తిరుమల శ్రీవారిని దువ్వాడ శ్రీనివాస్, దివ్వల మాధురి దర్శించుకున్నారు. ఏడుకొండలవాడి బ్రహ్మోత్సవాల్లో పాల్గొనడానికి తిరుమల వచ్చిన దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి.. సోమవారం ఉదయం స్వామివారి దర్శనం చేసుకున్నారు. అయితే, సాయంత్రం వీరిద్దరూ మాఢవీధుల్లో ఫొటోషూట్లు చేశారు. ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్, ఫొటోలు పోస్ట్ చేసే అలవాటు ఉన్న మాధురి.. సోషల్ మీడియాలో పోస్ట్ చేయడానికే తిరుమల మాఢవీధుల్లో ఫొటోషూట్లు చేసినట్టు తెలుస్తోంది. దీంతో మరోసారి ఈ జంట హాట్ టాపిక్‌గా మారిపోయింది. దువ్వాడ శ్రీనివాస్ డైరెక్షన్‌లో దివ్వెల మాధురి ఫోటో షూట్ అంటూ సోషల్ మీడియాలో ఈ వీడియోలు వైరల్ అయ్యాయి.
అయితే దివ్వెల మాధురి వెంట దువ్వాడ శ్రీనివాస్‌తో పాటు కెమెరామేన్ కూడా ఉన్నాడు. మాధురి మాఢవీధుల్లో అలా అలా తిరుగుతూ ఉంటే.. ఆమెను కెమెరామేన్ తన డీఎస్‌ఎల్ఆర్ కెమెరాలో బంధిస్తున్నాడు. అలాగే, కోనేరు వద్ద కూడా మాధురి ఫొటోషూట్, వీడియో షూట్ చేశారు. మాఢవీధుల్లో మాధురి ఈ విధంగా ఫొటోషూట్లు చేయడాన్ని భక్తులు తప్పుబడుతున్నారు. దైవ దర్శనానికి వచ్చి ఇవేం వేషాలంటూ విమర్శిస్తున్నారు. దీంతో దువ్వాడ, దివ్వెల మాధురి మరోసారి వార్తల్లో నిలిచారు.
మరోవైపు తిరుమలలో దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి పెళ్లి చేసుకున్నారంటూ వార్తలు గుప్పుమన్నాయి. ఇద్దరూ తిరుమలకు కలిసి రావటంతో ఈ వార్తలు వచ్చాయి. అయితే అదంతా ఒట్టిదేనని తేలిపోయింది. దివ్వెల మాధురి ఈ విషయంలో క్లారిటీ ఇచ్చారు. తాము ఇంకా వివాహం చేసుకోలేదన్న మాధురి.. కొంతమంది పనిగట్టుకుని ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్తే.. ఆ ఫోటోలు పెట్టి సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. వ్యవహారం ఇంకా కోర్టులోనే ఉందని.. కోర్చు తీర్పు తర్వాత పెళ్లి చేసుకుంటామని దివ్వెల మాధురి, దువ్వాడ శ్రీనివాస్ స్పష్టం చేశారు. అప్పటివరకూ కలిసే ఉంటామని చెప్పారు, అయితే పెళ్లి మాటెలా ఉన్నాకానీ.. పవిత్రమైన తిరుమలలో ఫోటో షూట్ చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.