ప్రజల ఆర్భాటాలు కోసమే చంద్రబాబు ప్రయత్నం చేశాడు. సంక్షోభంలో చంద్రబాబు అవకాశాలు వెతుక్కుంటాడు.. ఇప్పుడు అవినీతి చేస్తున్నారు అని వైసీపీ నేత వెల్లంపల్లి శ్రీనివాస్ ఆరోపించారు. ఆయన మాట్లాడుతూ..... ఎంత ఖర్చు పెట్టారో మంత్రులు చెప్పలేకపోతున్నారు..ఆర్టీఏ అప్లయి చేసుకోమంటున్నారు.
విజయవాడ ఇమేజీని డ్యామేజ్ చేసింది కూటమి ప్రభుత్వం. కుమ్మరి పాలెం, ఊర్మిళ నగర్, హౌసింగ్ బోర్డ్ ఏరియాలో ఒకరికి నష్ట పరిహారం అందలేదు. చెప్పిన మాట ప్రకారం వైఎస్ జగన్ కోటి కాదు.. కోటిన్నర ఖర్చు చేశారు. వైఎస్ జగన్ని చూసి కూటమి నేతలు సిగ్గు తెచ్చుకోవాలి. కలెక్టరేట్లో అప్లికేషన్లు అమ్ముకుంటున్న చరిత్ర కూటమి ప్రభుత్వంది. వరద బాధితులకు చివరి వ్యక్తి వరకు పరిహారం అందేవరకు పోరాటం చేస్తాం అని హామీ ఇచ్చారు.