గోదావరి పరీవాహక ప్రాంతాల్లో వరద భయానికి త్వరలో చెక్ పడనుంది. 14ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న అవుట్‌ఫాల్ స్లూయిస్ నిర్మాణ పనులకు, అసంపూర్తిగా మిగిలిన ఏటిగట్టు ఎత్తు పనులకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. సుమారు రూ. 16 కోట్ల అంచనాతో పంపిన పనులకు క్లియరెన్స్ ఇస్తూ జీవో జారీ చేసింది. దీంతో అధికారులకు ఈ పనులకు సంబంధించిన టెండర్లు ఆహ్వానిం చేందుకు సన్నద్ధమవుతున్నారు. జిల్లాలో సిద్ధాంతం నుంచి నరసాపురం మండ లం బియ్యపుతిప్ప వరకు సుమారు 45 కిలో మీటర్ల మేర ఏటిగట్టు విస్తరించింది. 2006లో గట్టు పటిష్టం చేసే పనులకు అప్పటి ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేసింది. దొడ్డిపట్ల, వాకలగరువు, అబ్బిరాజుపాలెం, లక్ష్మి పాలెం, యలమంచిలి, గంగడపాలెం తదితర ప్రాంతాల్లో గట్టు ఎత్తు పనులు పెండింగ్‌లో పడ్డాయి. వరదలు వస్తే ప్రజలు భయంతో బిక్కు బిక్కుమంటూ గడపాల్సి వచ్చేది.
పలుమార్లు వరదలతో భారీ నష్టాన్ని చూడా చవిచూశారు. తాత్కాలికంగా ఇసుక బస్తాలతో గట్టును ఎత్తు చేస్తున్నప్పటికీ వరద ప్రవాహానికి ఫలితం లేకుండా పోయింది. 2009 ఈ పెండింగ్ పనులు పూర్తి చేసేందుకు అనేకసార్లు ప్రతిపాదనలు పంపినా మోక్షం లేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వరద నివారణపై ప్రత్యేక దృష్టి సారించింది. నీటి పారుదలశాఖ మంత్రి నిమ్మల రామనాయుడు బాధ్యతలు చేపట్టగానే ముఖ్యమంత్రి చంద్రబాబుకు సమస్యను వివరిం చారు. అధికారులతో ప్రతిపాదనలు సిద్ధం చేయిం చి నిధుల మంజూరుకు కృషి చేశారు. ఫలితంగా ఈ పెండింగ్ పనులకు ప్రభుత్వం రూ.4.45కోట్లు విడుదల చేసింది.